iphone SE 4 రిలీజ్ డేట్ ఫిక్స్.. వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్

ఐఫోన్ SE సిరీస్ మొబైల్ కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ SE 4 మొబైల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు టెక్ మార్కెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న  ఐఫోన్ SE 4 మొబైల్ 2025 మార్చి నెలలో లాంఛ్ కానున్నట్లు పలు నివేదికలు వెలువడుతున్నాయి. 

దక్షిణ కొరియాకు చెందిన అజు న్యూస్ పబ్లికేషన్ కథనం ప్రకారం.. ఆపిల్ త్వరలో భారీ ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తోందని, వచ్చే ఏడాది మార్చిలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది. ఈ కథనాన్ని ఉటంకిస్తూ.. ఇది ఐఫోన్ SE 4 మొబైల్ లాంఛ్ డేటే అని ప్రచారం మొదలైంది. ఆపిల్ తమ ఓల్డ్ వర్షన్ SE 3ని కూడా 2022 మార్చి నెలలోనే రిలీజ్ చేసింది. దీంతో అజు న్యూస్ పబ్లికేషన్ కథనం SE 4 మొబైల్ లాంఛ్ డేట్ విడుదల తేదీకి మరింత బలం చేకురుస్తున్నాయి. iPhone SE 3 మోడల్‎ను 2022 మార్చిలో లాంఛ్ చేయగా.. 2025 మార్చిలో ఐఫోన్ SE 4 మోడల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ యూజర్లకు శాటిలైట్‌‌తో సిగ్నల్స్‌‌

iPhone SE 4లో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా ఆపిల్ కొత్త AI పవర్ అంటే Apple Intelligence ఒకటి. ఆపిల్ 2024 సెప్టెంబర్ లో ఐఫోన్ 16 మోడల్‎ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్‎లో Apple Intelligence ఫీచర్ ను తీసుకొచ్చింది. ఆపిల్ యొక్క లేటేస్ట్ ఏఐ ఫీచర్..  iPhone SE 4లో కూడా ఉండనున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏఐ ఫీచర్‎తో పాటుగా  iPhone SE 4 ఫోన్ లో మరి కొన్ని మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. అప్‌గ్రేడ్ చేసిన సిరి, అధునాతన రైటింగ్, ఫోటో ఎడిటింగ్ టూల్స్, కెమెరా వంటి అనేక ఫీచర్లు iPhone SE 4లో ఉండనున్నట్లు టాక్. 

iPhone SE 4 మొబైల్ 48 MP కెమెరా, 6.1-అంగుళాల OLED స్క్రీన్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. SE 3 4.7-అంగుళాల డిస్‌ప్లేతో పోలిస్తే SE 4 మోడల్‌ డిస్ ప్లే పెద్దగా ఉండనుంది. సెల్ఫీల కోసం ఇది 12 MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 3,279mAh బ్యాటరీ కెపాసిటీతో రిలీజ్ కానున్న ఐఫోన్ SE 4  మోడల్ ఫోన్ ధర భారత్‎లో రూ.45,000 నుండి రూ.50,000 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే, ఐఫోన్ SE 4 మోడల్ ఫోన్ రిలీజ్ డేట్ పై ఆపిల్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.