iPhone SE 4 త్వరలో విడుదల..ఒకేసారి 86 లక్షల ఫోన్ల ఉత్పత్తి!

ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్..iPhone SE4ను త్వరలో విడుదల చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. 2022లో మునుపటి iPhone SE  వెర్షన్ ప్రారంభించిన యాపిల్..సరసరమైన, స్నేహ పూర్వక బడ్జెట్ డివైజ్ తదుపరి మోడల్ iPhone SE4ను మరికొద్ది రోజుల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. 

 2024 చివరలో ప్రత్యేకించి డిసెంబర్ నాటికి దాదాపు 8.6 మిలియన్ యూనిట్లు అంటే 8.60 లక్షల iPhone SE4 లను ఉత్పత్తిని ప్రారంభింస్తుందట. ఈ ఉత్పత్తి డిసెంబర్ 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు ఉంటుందని యాపిల్ వర్గాలు చెబుతున్నాయి. iPhone SE4 అధికారికంగా ఏప్రిల్ 2025లో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. 

Also Read :- కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్

ఈ కొత్త డివైజ్ లో Apple  డేటాబేస్ లో V59 అనే కోడ్ నేమ్ జత చేయబడింది. iPhone SE4 బ్యాక్ ప్యానెల్ లు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. ఇది టిప్ స్టర్ సోనీ డిక్సన్ ఐఫోన్ 7 ప్లస్ డిజైన్ ను పోలి ఉంది. ఈ ప్యానెల్ ప్లాట్గా కనిపిస్తుంది. డ్యుయెల్ కెమెరా అరేంజ్ మెంట్ ను కలిగి ఉంటుంది.  

స్పెసిఫికేషన్లు 

iPhone SE4 స్మార్ట్ ఫోన్ 6.06 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 48 MP కెమెరాతో ఈ సిరీస్ లో ప్రారంభ మోడల్ గా రావచ్చు. అదనంగా 60 Hz రిఫ్రెష్ రేట్ కు మద్దతునిచ్చే OLED ప్యానెల్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ సరికొత్త A18 బయోనిక్ చిప్ తో వస్తుంది.8GB  LPDDR5 RAM కి సపోర్టు చేస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 128GB, 256GB , 512 GB వేరియంట్లు ఉండనున్నాయి.