మొట్టమొదటిది: సొంత5G మోడెమ్తో యాపిల్ ఐఫోన్

యాపిల్ తన కొత్త ఐఫోన్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ ను ప్రారంభించిన తర్వాత యాపిల్ రాబోయే ఐఫోన్ గురించి చర్చలు మొదలయ్యాయి. అదే iPhone SE4 ఐఫోన్. దీనిని 2025లో లాంచ్ చేసేందుకు యాపిల్ ప్లాన్ చేస్తోంది. సరసమైన ధరలతో ఐఫోన్16 సిరీస్ మంచి ప్రజాదరణ పొందింది. రాబోయే iPhone SE4 కూడా అదే విధంగా ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. 

 iPhone SE4 మోడల్ ఐఫోన్14 లాగా సేమ్ ఫీచర్లను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు. తాజా లీకుల బట్టి చూస్తే..iPhone SE4  మోడల్ యాపిల్ తన సొంత 5G మోడెమ్తో వస్తుందని తెలుస్తోంది.

యాపిల్ గత కొంత కాలంగా సొంత 5G మోడెమ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అది iPhoneSE4 తో సాధ్యం చేసుకునేందుకు కృషి చేస్తోంది. క్వాంటమ్ మోడెమ్ లపై బదులుగా Apple Intel  మోడెమ్ ను కొనుగోలు చేసింది. అయినప్పటికీ Apple నమూనా మోడెమ్ లు అనేక టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 

Apple తన స్వంత మోడెమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందవచ్చని అంచనా. దీంతోపాటు హార్డ్‌వేర్-సాఫ్ట్‌వేర్ ఏకీకరణను మెరుగుపరచడానికి టెక్నాలజీని ఉపయోగించాలని కూడా యోచిస్తోంది. 

కొత్త మోడెమ్ లో వవర్ మోడ్ ని యాక్టివేట్ చేయడం ద్వారా బ్యాటరీ యూసేజ్ ను గణనీయంగా తగ్గిస్తుంది. Apple 5G మోడెమ్‌ను కలిగి ఉన్న మొదటి ఐఫోన్ SE 4 విజయవంతమైతే తదుపరి ఐఫోన్లలో కూడా అదే ఉపయోగించనున్నారు. 

Apple 5G మోడెమ్ అప్ గ్రేడ్ తర్వాత ..డిజైన్ మార్పుకు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న iPhone SE .. iPhone 8 డిజైన్ తో ఉంది. iPhone SE4 లో డిజైన్ మార్చే అవకాశం ఉంది. రాబోయే ఆపిల్ డివైజ్ ఐఫోన్ 14లాగా తక్కువ బెజెల్లతో కనిపిస్తుంది. ఇది iPhone 14కి సమానమైన నాచ్ ను కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఇక iPhone SE4  4.7 అంగుళాల LCD  కాకుండా OLED తో మెరుగైన కాంట్రాస్ట్, మంచి విజుబులిటిని అందిస్తుంది. దీంతో పాటు iPhone 14 కొలతలతో పెద్ద స్క్రీన్ ను కలిగి ఉంటుందని అంచనా. 

కెమెరా విషయానికి వస్తే.. iPhone SE4 48 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాకు అప్ గ్రేడ్ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత SE మోడల్ లో 12 మెగా పిక్సెల్ కెమెరా మాత్రమే ఉంది. పిక్చర్ క్వాలిటీ పెంచేందుకు Apple కంప్యూటేషన్ ఫొటోగ్రఫీ ఫీచర్లను పరిచయం చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

రాబోయే ఆపిల్ డివైజ్ ఐఫోన్ 14 బ్యాటరీని కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. OLED డిస్ ప్లే, A18 చిప్ కు సపోర్ట్ చేస్తుంది. దీంతో iPhone SE4 రోజంతా పనిచేసేలా ఉంటుందని తెలుస్తుంది.