వీటి కోసం జనం ఎగబడుతున్నారు.. స్టోర్లు తెరవక ముందు లైన్లో..

ముంభై, ఢిల్లీ, బెంగుళూర్ వంటి నగరాల్లో శుక్రవారం స్టోర్స్, మాల్స్ ముందు గుంపులు గుంపులుగా యువత వచ్చి చేరుతున్నారు. పొద్దున్నే లేచి క్యూ కట్టారు. వీళ్లు లైన్లు కట్టి మరీ నిలబడేది ఇంటర్య్వూ కోసమే, జాబ్ కోసమే కాదు. ఫోన్ కోసం.. ఈ లైన్లు చూసీ ఫ్రీగా ఫోన్ ఇస్తున్నారేమో అనుకునేరు. ఆ ఫోన్ రేటు 70వేలు. ఆ ఫోన్ ధర ఎక్కువైనా సరే ఇంత క్రేజ్ ఎంట్రా బాబు. క్యూలో నిలబడి ఫోన్ దొరికిన వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఫస్ట్ టైం వచ్చిన దాన్ని చేజిక్కిచుకున్న అంటూ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఆ ఫోన్ పేరేంటంటే..

ఫోన్లలో ఐఫోన్ వేరయా అన్నట్టు.. ఆ బ్రాండ్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఐఫోన్ లో కొత్త సిరీస్ వచ్చిందంటే చాలా జనాలు ఎగేసుకుంటూ ఆపిల్ స్టోర్ల ముందు లైన్ కడతారు. అయితే ఐఫోన్‌ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16 సిరీస్ ఇండియాలో అందుబాటులోకి రానే వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఈ ఫోన్ల అమ్మకాలు భారత్‌లో మొదలయ్యాయి. దీంతో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ, ముంభై నగరాల్లో ఎగబడ్డారు. తెల్లవారకముందే ఆపిల్ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. ముంబై, ఢిల్లీతో స‌హా ప‌లు ఆపిల్ స్టోర్ల బ‌య‌ట కొనుగోలుదారులు బారులు తీరారు. ఆపిల్ కంపెనీ 16 సిరీస్ లో నాలుగు వేరియంట్లను ఇట్స్‌ గ్లోటైమ్‌ పేరుతో సెప్టెంబర్ 9 న నిర్వహించిన ఈవెంట్‌లో లాంచ్ చేసింది. కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఈవో టిమ్‌ కుక్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. 

ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొమ్యాక్స్‌ అనే నాలుగు మోడళ్లను యాపిల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి స్టార్టింగ్ ప్రైజ్ రూ.79వేల 900. ఈ సిరీస్‌ ఆపిల్ కంపెనీ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది. అందుకే వీటికి ఇంత డిమాండ్. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌, లేటెస్ట్ కెమెరా కంట్రోల్‌ పీఛరుతో పాటు కొత్త బటన్లు కూడా ఉన్నాయి. కొత్త సిరీస్‌ ఫోన్లలో ప్రత్యేకంగా తయారైన న్యూ చిప్‌ ఏ18ను అమర్చారు. అంతే కాదు 16 సిరీస్‌ ఫోన్లను ఎయిరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియంతో రూపొందించారు.

ALSO READ : స్టూడెంట్స్‌కు RBI బంపర్ ఆఫర్: రూ.10లక్షలు గెలుచుకునే ఛాన్స్ !