ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్

ఆపిల్ ఫోన్ కొనాలనుకునే వారి ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే ఉంది. టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషన్లు, మొబైల్స్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైం. ప్రస్తుతం ఫ్లిఫ్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో ఐ ఫోన్ 15 పైన 16 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులపై నవంబర్ 24 నుంచి 29 వరకు అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్ పై 80 శాతం వరకు ఆఫర్ వస్తోంది. బ్రాండెడ్ కంపెనీలు ఆయా కంపెనీల ఆఫర్ కాకుండా.. ఫ్లిఫ్ కార్ట్ డిస్కాండ్ కూడా ఈ బ్లక్ ఫ్రైడే సేల్ లో నడుస్తోంది. iPhone 15 చాలా తక్కువకే వస్తుంది. దీనిపై 15 శాతం డిస్కాంట్ ప్రకటించింది. ఫ్లిఫ్ కార్ట్ ఈ కామర్స్ కంపెనీ. 

ఐ ఫోన్ 16 లాంచ్ చేసిన తర్వాత, 15 మోడల్ కు భారీగా డిస్కౌంట్ ఇస్తోంది ఆపిల్ కంపెనీ. 16 లాంచ్ చేసిన తర్వాత ఐ ఫోన్ 15 మీద రూ.10వేలు తగ్గించింది. తాజాగా మళ్లీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ 16శాతం డిస్కాంట్ ప్రకటించింది. దీంతో ఎన్నడూలేనంత తక్కువ ధరకే ఐ ఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ఫోన్ యొక్క అన్ని వెర్షన్‌లకు వర్తిస్తుంది. 128GB, 256GB, 512GB మూడు వేరియంట్లలో ఇది ఫ్లిప్ కార్ట్ లో ఉంది. ఐఫోన్ 15 స్టార్టింగ్ ప్రైజ్ రూ.69,900 కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 16శాతం డిస్కాంట్ తో రూ. 58,249కి లభిస్తోంది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు మరో 5 శాతం కూడా తగ్గించుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ కూడా ప్రసెంట్ అందుబాటులో ఉంది. ఐ ఫోన్ ఓల్డ్ మొబైల్ ఎక్జైంజ్ లో కొంటే మీరు రూ.32,950 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.