iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌.. ఐఫోన్ 14, 15న్లపై భారీ తగ్గింపు

ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌ కానుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 నిమిషాలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్​తో పాటు పలు వాచ్, ఐప్యాడ్ వంటి పలు గ్యాడ్జెట్స్​పై ఈ ఈవెంట్​లో ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో మునుపటి సిరీస్ లైన ఐఫోన్ 14, ఐఫోన్15న్లపై ఈ- కామర్స్ సైట్లు భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంచాయి.

ఐఫోన్ 15పై రూ. 8వేల తగ్గింపు 

ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12, 2023న భారతదేశంలో ప్రారంభించబడింది. ఆ సమయంలో ఐఫోన్ 15 బేస్ వేరియంట్ ధర రూ.79,600. అదే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,999కు అందుబాటులో ఉంది. అంటే వాస్తవ ధరపై రూ. 8వేల తగ్గింపు ప్రకటించారు. అలాగే  కొనుగోలు సమయంలో ఫ్లిప్‌కార్ట్ UPIని ఉపయోగించడంపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. తద్వారా బేస్ వేరియంట్ ను రూ.68,999కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 14పై రూ.22వేల తగ్గింపు 

సెప్టెంబర్ 8, 2022న భారతదేశంలో లాంచ్ అయిన ఐఫోన్ 14 బేస్ వేరియంట్ ధర రూ.79,900. అదే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999కు అందుబాటులో ఉంది. అంటే వాస్తవ ధరపై రూ. 22వేల తగ్గింపు ప్రకటించారు. అలాగే  కొనుగోలు సమయంలో ఫ్లిప్‌కార్ట్ UPIని ఉపయోగించడంపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.

లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్

ఆపిల్ 16 ఈవెంట్‌ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆపిల్ పార్క్‌లో జరగనుంది. లంచ్ ఈవెంట్ అమెరికాలో ఉదయం 10 PT(భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30)కు ప్రారంభమవుతుంది. ఆసక్తి గల ఐఫోన్ ప్రేమికులు Apple అధికారిక YouTube ఛానెల్‌లో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.