Jio Vs Airtel Vs Vi : కనీస ఫోన్ రీఛార్జ్ కోసం ఏ కంపెనీ ప్లాన్ అయితే బెస్ట్..

ఇటీవల రీచార్జ్ ఫ్లాన్ల ధరలు పెంచి అన్ని టెలికం సంస్థలు కస్టమర్లకు షాకిచ్చాయి. మొదట రిలయన్స్ జియో తన రీచార్జ్ ప్లాన్లకు సంబంధించిన రేట్లను దాదాపు 25శాతం పెంచింది. దీంతో కస్టమర్లపై వేలకోట్లలో భారం పడింది. జియో తర్వాత మిగతా టెలికం కంపెనీలు కూడా తమ నెట్ వర్క్ లకు సంబంధించిన రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంలో  పోటీ పడ్డాయి. దీంతో సెల్ ఫోన్ల వాడుతున్న ప్రతి కస్టమర్ పైనా మరింత భారం పడింది. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేకుండా.. రీచార్జ్ చేయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.. ఉన్నవాటిలో అందుబాటు ధరల్లో ఉన్న ఏదో ఒక నెట్ వర్క్ ను  ఎంచుకోక తప్పట్లేదు.. దీంతో కస్టమర్లకు ఏ నెట్ వర్క్ తక్కువ ధరలకు రీచార్జ్ ప్లాను ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోవాలని ఉంటుంది.. అటువంటి వారి సందేహాలను తీర్చుతుంది ఈ ఆర్టికల్. 

రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా  ఇంటర్నెట్ నెట్ వర్క్ సంస్థలు అందిస్తున్న కనీస రీచార్జ్ ప్లాన్లను పోల్చుతూ ఇందులో  పొందుపరిచాం.. 

Airtel కనీస వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్

Airtel తన కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను రూ. 20 పెంచింది. గతంలో రూ. 179 ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు రూ. 199,  28 రోజుల చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లు ప్రతిరోజూ 2GB డేటా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఉచిత SMSలను అదిస్తోంది. 

Vi కనీస వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్

Vodafone Idea కనీస రీఛార్జ్ ప్లాన్ రూ.98 ఈ ప్లాన్ 10 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒక నెల కవర్ చేయడానికి కస్టమర్లు రూ.199తో రీఛార్జ్ చేసుకోవాలి. రూ.98 ప్లాన్ వినియోగదారులకు 200MB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో ఉచిత SMS లు లేవు. 

jio కనీస వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్

jio కస్టమర్లకోసం కనీస రీఛార్జ్ ప్లాన్ ధర రూ.149 ను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ  14 రోజులు. ఈ ప్లాన్‌లో రోజుకు 1GB డేటా అన్ లిమిటెడ్ కాల్స్, అదనంగా Jio TV , Jio సినిమా వంటి ఫీచర్లకు యాక్సెస్ ఉంది. 

వీటోతోపాటు దేశవ్యాప్తంగా BSNL తన 4G సేవలను వచ్చే నెలలో ప్రారంభిస్తోంది. కంపెనీ ఇటీవల 10,000 మొబైల్ టవర్లను 4Gకి అప్‌గ్రేడ్ చేసింది. అదనంగా,  BSNL దాని సోషల్ మీడియా ఛానెల్‌లలో రాబోయే 4G సేవల గురించి తెలిపింది. X లో ఒక పోస్ట్‌లో కంపెనీ వీడియో ద్వారా కొత్త 4G రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు కస్టమర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ , 4G ఇంటర్నెట్ డేటాతో సహా ఆకట్టుకునే ఆఫర్లను అందించేందుకు BSNL సిద్దమవుతుంది.