శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందింది..వస్తున్నా: స్వామి నిత్యానంద

స్వామి నిత్యానందకూ అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానం అందింది.ఈ విషయం నిత్యానంద స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఈఉత్సవానికి తాను వెళ్లతున్నట్లు ప్రకటించారు. తనను తాను దైవాంశసంభూతుడునని చెప్పుకునే నిత్యానంద చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలనూ ఉన్నాయి. ఈ వివాదాల తర్వాత ప్రత్యేకంగా కైలాస అనే ద్వీపాన్ని కొనుగోలు చేసి అదే తన దేశమని ప్రకటించుకున్నారు. 

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని.. ఈ ఉత్సవానికి తాను వస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు స్వామి నిత్యానంద. ఇలాంటి చారిత్రక ఘట్టాన్ని చూసే అవకాశం వస్తే ఎవరూ మిస్ కావొద్దని X వేదికగా  పోస్ట్ పెట్టారు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించేందుకు రాముడు అయోధ్యలో కొలువు దీరనున్నాడని నిత్యానంద అన్నారు.