న్యూ ఇయర్ పార్టీకి వెరైటీగా ఆహ్వానం.. గెస్ట్లకు గిఫ్ట్గా కండోమ్స్.. ఓఆర్ఎస్​, హెల్మెట్​ ఇచ్చిన పబ్

  • మహారాష్ట్రలోని పుణెలో, పబ్ ఓనర్ల నిర్వాకం

పుణె: న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్​కు ఎక్కువమందిని అట్రాక్ట్ చేసేందుకు ఓ పబ్ ఓనర్లు కొత్తగా ప్లాన్ చేశారు. సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి యువకులను రప్పించాలని అనుకున్నరు. అందుకు ఇన్విటేషన్​లు కొట్టించారు. వాటితో పాటు బైకర్లకు హెల్మెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కండోమ్స్ ప్యాక్ చేయించారు. వాటన్నింటినీ తమ పబ్​కు వచ్చిన పాత కస్టమర్లందరికీ పంపించారు. ఆ పార్సెల్​ను అందుకున్న ఓ యువకుడు దానిని ఫొటో తీసి ఫేస్​బుక్​లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 

బాక్స్ లో హెల్మెట్ కూడా.. 

మహారాష్ట్రలోని పుణె జిల్లా ముంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని హై స్పిరిట్స్ క్లబ్ న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్​లో పార్టిసిపేట్ చేయాలంటూ తమ పబ్​కు తరచుగా వచ్చే కస్టమర్లకు ఇన్విటేషన్​పంపింది. బైక్ మీద వచ్చేవాళ్లు హెల్మెట్ యూజ్ చేయాలని, మద్యం తాగి బండ్లు నడపొద్దని సూచిస్తూ, ఓ గిఫ్ట్ ప్యాక్​ను పంపింది. అందులో బైకర్లకు హెల్మెట్​తో పాటు, డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరం మేరకు కండోమ్స్ యూజ్ చేయాలని చెప్పకనే చెప్పినట్లయింది. 

గిఫ్ట్ ప్యాక్​ను ఓ వ్యక్తి ఫేస్​బుక్​లో పెట్టడంతో వైరల్ కాగా, కాంగ్రెస్ నేతలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చీప్ ప్రచార ప్లాన్లతో యూత్​ను ఖరాబ్ చేస్తూంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు పబ్ ఓనర్లపై కేసు పెట్టి ఈవెంట్​ను రద్దు చేయించేపనిలో పడ్డారు. అయితే, తమ రెగ్యులర్ కస్టమర్లయిన 40 మందికి మాత్రమే గిఫ్ట్​లు పంపామని పబ్ ఓనర్లు చెప్తున్నారు.