ఎన్టీపీసీ ‘మౌదా’ ఎన్నికల్లో ఐఎన్​టీయూసీ గెలుపు

గోదావరిఖని, వెలుగు : ఎన్టీపీసీ సంస్థ మహారాష్ట్ర నాగ్​పూర్​లోని మౌదా వద్ద గల ప్రాజెక్ట్​లో శనివారం జరిగిన గుర్తింపు  యూనియన్​ ఎన్నికల్లో ఐఎన్​టీయూసీ ఘన విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్​బీసీ మెంబర్​, ఐఎన్​టీయూసీ నేషనల్​సీనియర్​జనరల్​సెక్రెటరీ బాబర్​ సలీంపాషా సారథ్యంలోని ఐఎన్​టీయూసీ యూనియన్​103 ఓట్లు సాధించగా, బీఎంఎస్​ యూనియన్​ 46 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.  

గెలిచిన ఐఎన్​టీయూసీ యూనియన్​కు ప్రెసిడెంట్​గా బాబర్​ సలీంపాషా, జనరల్​ సెక్రెటరీగా ప్రణయ్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​గా రమేశ్ వ్యవహరించనున్నారు.  ఎన్టీపీసీ మౌదా ప్రాజెక్ట్​లో ఐఎన్​టీయూసీ ఘన విజయం సాధించడం పట్ల రామగుండం ఎన్టీపీసీ మజ్దూర్​యూనియన్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ వేముల కృష్ణయ్య, జనరల్​ సెక్రెటరీ ఆరెపల్లి రాజేశం శుభాకాంక్షలు తెలిపారు.