మైక్రోసాఫ్ట్ డౌన్.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స‌ర్వీసుల్లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపార సంస్థలు, బ్యాంక్‌ల‌పై, వ్యవస్థలపై  తీవ్ర ప్రభావం ప‌డింది. దీంతో పలు కంపెనీలు తమ సంస్థ సేవా కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాలపై వినియోగదారులను అన్ని విధాలుగా అభ్యర్థిస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విండోస్ వినియోగదారులకు సాంకేతిక లోపం వల్ల  వారి డెస్క్ టాప్ పై బ్లూ స్క్రీన్లు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు వివిధ రకాల మీమ్స్ వేస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు.  అవేంటో మీరు కూడా చూసి హాయిగా నవ్వుకోండి.