నిజామాబాద్ లో 795 మంది, కామారెడ్డిలో 421 గైర్హాజరు
నిజామాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ బుధవారం స్టార్ట్అయ్యాయి. 19,117 మంది విద్యార్థులకు గానూ 18,322 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. 795 గైర్హాజరయ్యారు. 8 పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్, 20 సెంటర్లలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్తనిఖీలు నిర్వహించారు. నవీపేట మోడల్ కాలేజ్ సెంటర్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఒకరిపై కేసు నమోదైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి పేర్కొన్నారు.
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియెట్ఫస్టియర్ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగాయి. 37 సెంటర్లలో పరీక్షలు జరగగా 9750 స్టూడెంట్స్‌కు గాను 9,329 మంది అటెండయ్యారు. 421 మంది పరీక్షలు రాయలేదు. జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి మండల కేంద్రంలోని ఎగ్జామ్సెంటర్లను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. స్టూడెంట్స్‌కు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. నోడల్ ఆఫీసర్ షేక్ సలాం కూడా సెంటర్లను పరిశీలించారు.