ఆర్మూర్ లో భూలక్ష్మి మాతా విగ్రహ ప్రతిష్ఠాపన

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని మహాలక్ష్మి మందిర ఆవరణలో ఆదివారం సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో  భూలక్ష్మి మాతా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  ప్రత్యేక పూజలు హోమం నిర్వహించి శాస్రోక్తంగా భూలక్ష్మి మాతా విగ్రహ ప్రతిష్ఠాపన జరిపించారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాజు, కర్తన్ దినేశ్, సభ్యులు, సదర్లు పాల్గొన్నారు.