టెక్నాలజీ : ఇన్​స్టాలో ప్రొఫైల్ సాంగ్..మరిన్ని విశేషాలు ఇవి...

ఇన్​స్టాగ్రామ్​లో రోజుకో సరికొత్త ఫీచర్​ అందుబాటులోకి వస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇన్​స్టా ప్రొఫైల్​ సాంగ్​ పేరుతో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్​ ఉంటే ప్రొఫైల్​లో పాటను మీ మూడ్​ లేదా ఎమోషన్​కు తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ప్రొఫైల్ చూస్తే ఆ పాట ప్లే అవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! దీని గురించి మరిన్ని విశేషాలు ఇవి...

ఇన్​స్టాగ్రామ్​లో కొత్తగా వచ్చిన ఇన్​స్టా ప్రొఫైల్ సాంగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. యూజర్లు పాట ప్లే చేయడానికి ప్లే బటన్ నొక్కాలి. ఎందుకంటే ఇందు​లో ఆటో ప్లే ఆప్షన్ లేదు. అయితే, ఇందులో పాటను దాదాపు 30 సెకన్లు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. అది కూడా మీ మూడ్​కు తగ్గట్టు పాటలను ఎంచుకోవచ్చు. ఇందుకోసం కొన్ని లైసెన్స్ డ్​ సాంగ్స్​ ఉంటాయి. వాటిలో నచ్చిన పాటను సెట్ చేసుకోవచ్చు. అయితే, ప్రొఫైల్ సాంగ్ సెట్ చేసుకున్నాక, ఆ పాటని మళ్లీ మీరు మార్చుకునేవరకు ప్రొఫైల్​లో అలాగే ఉంటుంది. 

వాట్సాప్​ స్టేటస్​లా ఒక్కరోజులో డిసప్పియర్ కాదు. అంటే మాన్యువల్​గా మార్చుకుంటేనే పాట మారుతుంది. ఈ ఫీచర్​ని వాడాలంటే ఇన్​స్టాగ్రామ్​ను ప్లే స్టోర్​లోకి వెళ్లి అప్​డేట్ చేసుకోవాలి. తర్వాత ఇన్​స్టా ఓపెన్ చేసి, ప్రొఫైల్ ట్యాబ్​లోకి వెళ్లాలి. అందులో ‘ఎడిట్ ప్రొఫైల్​’ ఆప్షన్​ సెలక్ట్ చేసుకోవాలి. తరువాత ‘యాడ్ మ్యూజిక్​ టు యువర్ ప్రొఫైల్’ పై ట్యాప్ చేస్తే.. పాటల లిస్ట్ వస్తుంది. అందులో నచ్చిన పాటను సెలక్ట్ చేసుకుని, ఆ క్లిప్ రన్​ టైం సెలక్ట్ చేసుకోవాలి. అయితే, ఈ ఫీచర్​ ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుందట మెటా.