ఇన్​స్టా నోట్స్​లో షార్ట్​ వీడియో 

ఇన్​స్టాగ్రామ్​ నోట్స్ ఫీచర్​కి మరో అప్​గ్రేడ్ వచ్చింది. యూజర్లు నోట్స్​గా షార్ట్​ వీడియోలను షేర్​ చేసుకోవచ్చు. యూజర్లు మెసేజ్ సెక్షన్ నుంచి పైన ఉన్న షార్ట్​ టెక్స్ట్​ నోట్స్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. 

పోయినేడాది ఇన్​స్టాగ్రామ్​ ప్లాట్​ ఫాం నోట్స్ ఫీచర్​ని​ తెచ్చింది. అప్పటి నుంచి నోట్స్​ ఫీచర్​కి అనేక అప్​డేట్​లు వచ్చాయి. వాటి ద్వారా యూజర్లు షార్ట్ మ్యూజిక్, వాయిస్ నోట్స్​ షేర్ చేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు దాంతో డైరెక్ట్ మెసేజ్​ సెక్షన్ పైన రెండు సెకన్ల షార్ట్ వీడియో నోట్​లను షేర్ చేసుకునే వీలు కల్పించింది. 

నోట్స్ అప్​లోడ్

యూజర్లు తమ డైరెక్ట్ మెసేజింగ్ సెక్షన్ యాక్సెస్ చేయాలి. ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని ఓపెన్ చేసి ఇన్​బాక్స్​కి నావిగేట్ చేయాలి. నోట్స్​లో ప్రొఫైల్​ ఫొటోను సెలక్ట్ చేసుకోవాలి. నోట్స్​ ట్రేలో ఉన్న యూజర్​ ఫొటోపై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత రికార్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కెమెరా ఐకాన్​ క్లిక్ చేయాలి. వీడియోని క్యాప్చర్ చేయడానికి ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలి. వీడియో రికార్డ్ చేసి నోట్స్ సెండ్ చేయొచ్చు. పోస్ట్ చేసేముందు టెక్స్ట్​ క్యాప్షన్ ఇవ్వొచ్చు.

వీడియో నోట్​ని పోస్ట్ చేశాక అది 24 గంటలపాటు ఫాలోవర్స్​, ఫ్రెండ్స్​కి కనిపిస్తుంది. ఈ నోట్స్​కి రిప్లయ్ ఇవ్వాలంటే ఇన్​స్టా ఓపెన్ చేసి, డైరెక్ట్​ మెసేజ్​ సెక్షన్​కి వెళ్లాలి. రిప్లయ్ డాక్యుమెంట్ ఓపెన్​ చేసి వీడియో నోట్​పై క్లిక్ చేయాలి. ఫొటో, వీడియో, జిఫ్​ లేదా ఆడియో నోట్స్​ పంపడానికి మెసేజ్​ టైప్ చేసి, ఆప్షన్లను సెలక్ట్ చేయాలి.