రూల్స్ పాటించని ఇన్‌స్టాగ్రామ్ : టీన్‌ఏజ్ కుర్రాళ్లకు కూడా అవి చూపిస్తోంది

చిన్నా లేదు.. పెద్దా లేదు అందరికీ ఒకటే కంటెంట్.. అంటూ రూల్స్ పాటించని ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం. సోషల్ మీడియా ప్రభావం యువత మీద చాలా చూపుతుంది. రూల్స్ ప్రకారం... 18+ అడల్ట్ కంటెంట్ టీన్ ఏజ్ పిల్లలకు చూపించకూడదు. ఇంటర్నెంట్ నియమనిబంధనలో అది ఒకటి. కానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం 13ఏళ్ల పిల్లాడికి కూడా అడల్ట్ కంటెంట్ చూపిస్తుందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. కొంతమంది పరిశోధకులు 2024 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో 13ఏళ్ల ఏజ్ నెంబర్ ఎంటర్ చేసి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేశారు. 

అయితే ఆ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన 20 నిమిషాల్లోనే ఇన్ స్టాగ్రామ్ 18+ అడల్ట్ కంటెంట్ ప్రమోట్ చేసింది. మహిళ శరీరావయవాలు ఆకర్శించే విధమైన వీడియోలు ఆ ప్రొఫైల్ లో ప్రసారమైయ్యాయి. ఇలా టిక్ టాక్, స్నాప్ చాట్ యాప్ లో చూపించలేదు. ఆ యాప్స్ రూల్స్ ఫాలో అవుతున్నాయి కానీ, ఇన్ స్టాగ్రామ్ చిన్న 18 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా అడల్ట్ కంటెంట్ ప్రమోట్ చేస్తుంది. ఈ సర్వే ద్వారా తేలిన విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.