వాట్సాప్‌లో మెసేజ్‌లను డిజేబుల్ చేసినట్టే ఇప్పుడు ఇన్‌స్టాలో కూడా చేయొచ్చు. రీడ్ రెసిప్ట్స్ని డిజేబుల్ చేసేలా ఇన్‌స్టా కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అనౌన్స్ చేశాడు. దాని గురించి పూర్తి డిటెయిల్స్ ఇంకా చెప్పలేదు. కానీ, ఆ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ హెడ్ అయిన ఆడమ్ మొస్సెరి కూడా ఈ అప్ డేట్‌ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అందులో ఏముందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ సెక్షన్లో రీడ్ రెసిప్ట్స్ అనే టోగుల్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని డిజేబుల్ చేస్తే మెసేజ్ మీరు చూశారో లేదో అన్నది మెసేజ్ పంపిన వాళ్లకు తెలియదు. అంతేకాకుండా ఆడమ్ షేర్ చేసిన ఫొటో ఇన్స్టాగ్రామ్ కూడా కొత్త డిజైన్‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్స్టాలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉంది.