ఇన్​స్పిరేషన్ : ఇద్దరు యోధులు పెట్టిన కంపెనీ

ఓ 40 ఏండ్ల క్రితం.. వాక్‌‌‌‌‌‌‌‌మెన్ ఇన్వెన్షన్‌‌‌‌ ఒక విప్లవం. దాదాపు అన్ని దేశాల ప్రజలు ఏదో ఒక టైంలో దీన్ని వాడారు. అంతేకాదు.. చాలా కంపెనీలు ఆ డిజైన్‌‌‌‌ని కాపీ చేసి కాంపాక్ట్‌‌‌‌ సైజ్‌‌‌‌లో రకరకాల ప్లేయర్లను తెచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అంతటి ఇంపాక్ట్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేసిన వాక్‌‌‌‌మెన్‌‌‌‌ని తయారుచేసింది ‘సోనీ’ కంపెనీ. ఇదొక్కటే కాదు.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌‌‌‌లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన  సోనీ ఇప్పుడు ప్రీమియం బ్రాండ్‌‌‌‌ కేటగిరీలోకి వెళ్లిపోయింది. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పు తెచ్చుకున్న పెట్టుబడి, కిటికీలు కూడా సరిగ్గా లేని చిన్న వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో సోనీ జర్నీ మొదలైంది. కానీ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్‌‌‌‌కు ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రతి దేశంలో సోనీ ప్రొడక్ట్స్‌‌‌‌ కనిపిస్తాయి. ఇంతటి సక్సెస్‌‌‌‌ చూసిన ఈ కంపెనీ మొదట్లో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొంది. అది1945 మార్చి. రెండో ప్రపంచ యుద్ధం వల్ల జపాన్‌‌‌‌ బాంబుల వర్షాన్ని చూసింది. టోక్యో మీద బాంబు దాడితో జపనీస్ మిలిటరీ స్పెషల్ ఫోర్స్‌‌‌‌ని అక్కడికి పిలవాల్సి వచ్చింది.

దానివల్ల జపాన్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌లో వేర్వేరు డిపార్ట్‌‌‌‌మెంట్లలో పనిచేస్తున్న ఇద్దరు అసాధారణ వ్యక్తులు ఒకచోటికి వచ్చారు. వాళ్లే  సోనీ కంపెనీ ఫౌండర్స్ అకియో మొరిటా, మసరు ఇబుకా. మొరిటా వెపన్స్‌‌‌‌ రీసెర్చర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసేవాడు. ఇబుకా నేవీ లెఫ్టినెంట్‌‌‌‌. ఈ ఇద్దరూ మొదటిసారి టోక్యోలో కలుసుకున్నారు. అప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని వాళ్లు కూడా అనుకుని ఉండరు. 
 
యుద్ధం ముగిశాక.. 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. అప్పుడే మొరిటా, ఇబుకా మిలిటరీలో పనిచేయాల్సిన గడువు కూడా ముగిసింది. దాంతో ఇద్దరూ ఉపాధి కోల్పోయారు. పైగా జపాన్​లో ఆ టైంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఉద్యోగాలు లేని ఈ ఇద్దరూ ఉద్యోగ వేటలో పడ్డారు. 1946లో ఇబుకా షిరోకియా డిపార్ట్‌‌‌‌మెంటల్ స్టోర్‌‌‌‌లోని ఒక చిన్న వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో పని చేయడం మొదలుపెట్టాడు. అందులో రేడియోలను రిపేర్ చేయడం అతని పని.

ఇక ఇబుకా తన ఫ్రెండ్స్‌‌‌‌ కొంతమందితో కలిసి ఏదైనా బిజినెస్​ చేయాలి అనుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల చాలా రేడియోలు పాడయ్యాయి. మరికొన్ని షార్ట్‌‌‌‌వేవ్‌‌‌‌ యూనిట్‌‌‌‌ నుంచి డిస్‌‌‌‌కనెక్ట్‌‌‌‌ అయ్యాయి. అలాంటివి తిరిగి పనిచేయాలంటే... కొత్త ట్యూనింగ్ సిస్టమ్‌‌‌‌ అవసరం. అందుకోసం అడాప్టర్ల/ కన్వర్టర్లు బిగించాల్సి ఉంటుంది. ఇబుకా వాటిని తయారు చేయాలని డిసైడ్‌‌‌‌ అయ్యాడు. తన టీంతో కలిసి షార్ట్‌‌‌‌వేవ్ యూనిట్‌‌‌‌కు సాధారణ రేడియో యాక్సెస్‌‌‌‌ను అందించే షార్ట్-వేవ్ కన్వర్టర్లను  తయారు చేయడం మొదలుపెట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న మొరిటా యుద్ధంలో పరిచయమైన తన ఫ్రెండ్‌‌‌‌ ఇబుకాని కలిశాడు. అప్పటికే మొరిటాకు రేడియోలు రిపేర్ చేయడం పూర్తిగా తెలుసు. దాంతో ఇద్దరూ ఒక  రేడియో వర్క్‌‌‌‌ షాప్ పెట్టాలి అనుకున్నారు.1946 మేలో 500 యూఎస్ డాలర్లు అప్పుగా తీసుకుని ఎలక్ట్రానిక్స్​తో ప్రపంచాన్ని జయించాలనే కోరికతో ఒక చిన్న దుకాణం పెట్టారు. దానికి ‘టోక్యో సుషిన్ కెంక్యుజో’(టీటీకే) అని పేరు పెట్టారు. 

రైస్ కుక్కర్‌‌‌‌‌‌‌‌ 

ఇద్దరూ కలిసి కొత్త వస్తువు ఏదైనా తయారుచేసి, మార్కెట్‌‌‌‌ చేయాలి అనుకున్నారు. అప్పట్లోనే ఎలక్ట్రిక్‌‌‌‌ రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌‌‌‌‌ తయారు చేశారు. కానీ.. అది పెద్దగా సక్సెస్‌‌‌‌ కాలేదు. దాన్ని చెక్కతో తయారు చేశారు. కింది భాగంలో మాత్రం అల్యూమినియం ఎలక్ట్రోడ్లను పెట్టారు. దాంతో కుక్కర్‌‌‌‌‌‌‌‌లో అన్నం ఒక్కోసారి ఎక్కువగా, ఒక్కోసారి తక్కువగా ఉడికేది. ఆ సమస్య వల్ల దాన్ని మార్కెట్‌‌‌‌లో అమ్మలేకపోయారు. మొదటి ఏడాది7,000 యూఎస్‌‌‌‌ డాలర్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ లాభం 300 డాలర్లు మాత్రమే లాభం వచ్చింది.

రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్ అయినా.. పట్టు వదలకుండా మరో ప్రొడక్ట్‌‌‌‌ తయారుచేశారు. అదే ఎలక్ట్రిసిటీతో వేడయ్యే కుషన్‌‌‌‌. ఇది కూడా ఘోరంగా ఫెయిల్‌‌‌‌ అయ్యింది. అయినా.. వెనక్కి తగ్గలేదు. కాకపోతే ఇబుకా హోమ్‌‌‌‌ అప్లయెన్సెస్‌‌‌‌ మార్కెట్‌‌‌‌పై ఆశ వదులుకున్నాడు. మొరిటా మాత్రం దానిపైనే ఫోకస్ పెట్టాడు. 

టేప్‌‌‌‌ రికార్డర్‌‌‌‌‌‌‌‌ 

సక్సెస్‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్న మొరిటా, ఇబుకాలకు1950ల్లో టేప్‌‌‌‌ రికార్డర్‌‌‌‌‌‌‌‌ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది.1949లో జపాన్ బ్రాడ్‌‌‌‌కాస్టింగ్ కార్పొరేషన్ టేప్ రికార్డర్లను దిగుమతి చేసుకుంది. అలాంటివే కొత్త రకం టేప్‌‌‌‌ రికార్డర్లను తయారుచేయాలని డిసైడ్‌‌‌‌ అయ్యారు. టీటీకే టీం కష్టపడి రెండు ప్రొటోటైప్ టేప్ రికార్డర్లను తయారు చేసింది. వాటిలో ఒకటి జీ టైప్‌‌‌‌.. ఇది పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగపడుతుంది.

ఇందులో 60 నిమిషాల రికార్డింగ్ టైం ఉంటుంది. మరోటి ఏ టైప్‌‌‌‌.. ఇంటి అవసరాల కోసం వాడేది. ఇందులో 30 నిమిషాల రికార్డింగ్ టైం ఉంటుంది.  రెండు టేప్‌‌‌‌ రికార్డర్లు బాగానే ఉన్నాయి. కానీ.. జీ -టైప్‌‌‌‌కు మాత్రమే డిమాండ్ పెరిగింది. ఎందుకంటే.. జపాన్‌‌‌‌ ప్రజలు అప్పట్లో టేప్ రికార్డర్లను పెద్దగా వాడేవాళ్లు కాదు. అదే టైంలో ఇబుకా ఒక పుస్తకంలో వచ్చిన “టేప్ రికార్డర్.. తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉపయోగాలు” అనే ఇంగ్లిష్ ఆర్టికల్ చదివాడు. వెంటనే దాన్ని జపనీస్‌‌‌‌ భాషలోకి మార్చి మార్కెట్‌‌‌‌ చేశాడు. జనాలు ఆ ఆర్టికల్​ చదివాక టేప్‌‌‌‌ రికార్డర్లకు డిమాండ్‌‌‌‌ విపరీతంగా పెరిగింది. సేల్స్‌‌‌‌ ఆల్-టైమ్ రికార్డ్‌‌‌‌ స్థాయికి చేరుకున్నాయి. ఈ సక్సెస్‌‌‌‌తో టీటీకేని చిన్న షాపు నుంచి షినాగావాలోని ఒక పెద్ద ప్లాంట్‌‌‌‌కి మార్చేశారు. 

ట్రాన్సిస్టర్ విప్లవం

టేప్ రికార్డర్ సక్సెస్‌‌‌‌ తర్వాత ఇబుకా ‘గ్లోబల్ ఎలక్ట్రానిక్ ట్రెండ్స్‌‌‌‌’ని ఫాలో కావాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని డిసైడ్‌‌‌‌ అయ్యాడు. అదే టైంలో1952లో ‘‘ట్రాన్సిస్టర్” అనే టైనీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.  అప్పట్లో.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా వాక్యూమ్ ట్యూబ్‌‌‌‌లపై ఆధారపడేవి.