హోటళ్లలో అధికారుల తనిఖీలు

జ్యోతినగర్,వెలుగు: రామగుండం  కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ ఎఫ్ సీఐ క్రాస్ రోడ్డు  ప్రాంతంలోని   పలు రెస్టారెంట్ లో  శుక్రవారం  సానిటేషన్  అధికారులు తనిఖీలు నిర్వహించారు.  తాజ్ రెస్టారెంట్ లో  నాణ్యత ప్రమాణాలు పాటించకుండ  ఫ్రిజ్ లో  నిల్వ ఉంచిన చికెన్,ఇతర ఆహారపదార్థాలు లభించాయి. దీంతో ఆ రెస్టారెంట్ కు రూ.20 వేల జరిమాన విధించారు. 

ఆహార పదార్థాలలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.   కార్యక్రమంలో  హెల్త్ అసిస్టెంట్ కిరణ్, వైకుంఠం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.