ఎడపల్లి మండలంలో ప్రైవేటు క్లినిక్​ ల తనిఖీ

  •     డీఎంహెచ్ వోకు  నివేదిక ఇస్తామని వెల్లడి 

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రైవేటు క్లినిక్ లను సోమవారం మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు మండలంలోని 17 గ్రామాల్లో ప్రైవేటు క్లినిక్ లను పరిశీలించారు.  ఆర్ఎంపీ, పీఎంపీల విద్యార్హతలను, వారివద్దకు వచ్చే కేసులను అడిగి తెలుసుకున్నారు.  గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, టీబీ  కేసులను ఆర్ఎంపీ, పీఎంపీలు టేకప్​ చేసి  వైద్యం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది  ఆరా తీశారు.  ఇలాంటి కేసులు ఆర్ఎంపీ, పీఎంపీల వద్దకు వస్తే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలని సూచించారు.  

ప్రథమ చికిత్స కేంద్రం బోర్డు అని మాత్రమే పేరు పెట్టాలని సూచించారు. మెడికల్​ ఏజెన్సీలలో జనరిక్ మందులు తెచ్చి నాలుగు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు.  ఎడపల్లి మండల ఇన్ చార్జ్​ మెడికల్​ ఆఫీసర్ శాహిస్తా  ఫిర్ దౌస్​, సూపర్​ వైజర్​  దేవెందర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.