జలశక్తి అభియాన్ పనుల పరిశీలన

కామారెడ్డి టౌన్, వెలుగు : జలశక్తి అభియాన్​ ద్వారా కామారెడ్డి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పరిశీలనకు మంగళవారం కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది.  కేంద్ర పవర్ మినిస్ర్టీ డిప్యూటీ సెక్రటరీ బెంజమెన్​ కరుణాకరన్​ ఆధ్వర్యంలో టీమ్​ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. బృందానికి జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ వివరించారు. 

గ్రామీణాభివృద్ధి, గ్రౌండ్​ వాటర్, ఫారెస్టు, ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.  సైంటిస్టు శ్రీకృష్ణపవర్, అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, డీఎఫ్​వో నిఖిత, డీఆర్​డీవో ​సురేందర్, డీపీవో శ్రీనివాస్​రావు, ఇరిగేషన్​ ఆఫీసర్​ శ్రీనివాస్ పాల్గొన్నారు.