హిజ్బుల్లా సీక్రెట్ బంకర్‌లో కుప్పలు తెప్పలుగా డబ్బులు, బంగారం : చూడండి

బీరూట్ లోని హాస్పిటల్ కింద ఉన్న హిజ్బుల్లా సీక్రెట్ బంకర్ లో భారీగా డబ్బు, బంగారం ఉందని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. హిజ్బుల్లా బంకర్ లో వందల మిలియన్ల డాలర్లు, విలువైన బంగారం నిల్వలు ఉన్నట్లు చూసే ఓ వీడియోను ఇజ్రాయిల్ సైన్యం విడుదల చేసింది.

Also Read :- హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి

సెప్టెంబర్ లో ఇజ్రాయిల్ బలగాల చేత చంపబడ్డ హిజ్బుల్లా నాయకుడు సయ్యడ్ హసన్ నస్రల్లా ఆల్ సహెల్ హాస్పిటల్ కింద బంకర్ నిర్మించారని ఇజ్రాయిల్ చీఫ్ మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు. దీంతో ఇజ్రాయిల్ అన్ని హాస్పిటల్స్ ను లక్ష్యంగా చేసుకొని దాడుల చేయదని.. హిజ్బుల్లా సైన్యం ఏర్పాటు చేసుకున్న ఇతర ఆస్తుల నిల్వలను టార్గెట్ చేస్తోందని ఇజ్రాయిల్ తెలిపింది.