ఇండియన్‌‌‌‌ నేవీలో చేరిన ఐఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ విక్రాంత్‌‌‌‌

ముంబై: ఎయిర్‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ క్యారియర్‌‌‌‌‌‌‌‌ ఐఎన్ఎస్‌‌‌‌ విక్రాంత్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ నేవీలో చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ నౌక చేరికతో అరేబియా సముద్రంపై ఇండియా తన పట్టును పెంచుకోనుందని ఇండియన్ నేవీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దీంతో అరేబియా సముద్ర పశ్చిమ భాగంలో ఐఎన్ఎస్‌‌‌‌ విక్రాంత్‌‌‌‌, ఐఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ విక్రమాదిత్య రెండు ఎయిర్‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ క్యారియర్లు సేవలు అందించనున్నాయని వెల్లడించారు. ఈ రెండు వాహక నౌకలు కర్నాటకలోని కార్వార్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే, ఐఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ విక్రమాదిత్య త్వరలో రీఫిట్‌‌‌‌కు వెళ్తుందని ‘ఎక్స్‌‌‌‌’లో వెల్లడించారు.