సూసైడ్​ డ్రోన్​ నాగాస్త్ర‑1

ఆయుధ, రక్షణ వ్యవస్థ స్వావలంబనలో భాగంగా దేశీయంగా తొలిసారి అభివృద్ధి చేసిన సూసైడ్​(ఆత్మాహుతి) డ్రోన్​ నాగాస్త్ర–1 భారత సైన్యంలోకి చేరింది. నాగపూర్​కు చెందిన దేశీయ కంపెనీ సోలార్​ ఇండస్ట్రీస్​ ఎకనామిక్స్​ ఎక్స్​ప్లోజివ్స్​ లిమిటెడ్​(ఈఈఎల్​) ఈ సూసైడ్​ డ్రోన్​ను అభివృద్ధి చేసింది.

నాగాస్త్ర–1 శత్రువులపై దాడి చేయగలదు. అవసరమైతే దాడిని ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఇది దాడి చేసి సురక్షితంగా తిరిగి రాగలదు. లక్ష్యానికి పైన హోవర్​ చేయగల సామర్థ్యం ఉండటంతో దీనికి లాటరింగ్​ వెపన్​ అని పేరు పెట్టారు. ఇది 4500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో రాడార్​ వ్యవస్థకు చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఉదాహరణకు ఒక నిర్దిష్ట టైంలో నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లడానికి ఒక మిలిటెంట్​ను తీసుకెళ్లే కార్వాన్​ను నాగాస్త్ర గాలిలో తిరుగుతూ లక్ష్యంపై దాడి చేయగలదు. 
 
ఇది కామికేజ్​ మోడ్​లో దాడి చేస్తుంది. లక్ష్యాన్ని నాశనం చేయడంతోపాటు అది కూడాస్మాష్ అవుతుంది. అందుకే దీనిని సూసైడ్​ డ్రోన్ అని పిలుస్తారు.రక్షణ రంగంలో మేక ఇన్ ఇండియా కింద, భారత సైన్యం 480 నాగాస్త్ర–1 డ్రోన్లను ఈఈఎల్​కు ఆర్డర్​ చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.300 కోట్లు.