పర్యావరణ పనితీరు సూచీ 2024

ఎన్విరాన్​మెంటల్​ పెర్ఫార్మెన్స్​ ఇండెక్స్​(ఈపీఐ) దేశాల పర్యావరణ స్థితిగతులను అంచనా వేసే గ్లోబల్​ ర్యాంకింగ్​ సిస్టమ్​. వరల్డ్​ ఎకనామిక్​ ఫోరమ్​ ఎన్విరాన్​మెంట్​ సస్టయినబిలిటీ ఇండెక్స్​ను 2022లో ప్రవేశపెట్టింది. ఈ సూచీని యేల్​ సెంటర్​ ఫర్​ ఎన్విరాన్​మెంటల్​ లా అండ్​ పాలసీ, కొలంబియా సెంటర్​ ఫర్​ ఇంటర్నేషనల్​ ఎర్త్​ సైన్స్​ ఇన్ఫర్మేషన్​ నెట్​వర్క్​ సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రచురిస్తారు.

2024 సూచీలో 180 దేశాల్లో భారత్​ 176వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్​, వియత్నాం, లావోస్​, మయన్మార్​లు ఉన్నాయి. ఉద్గారాలను తగ్గించడంలోనూ పర్యావరణ సుస్థిరతను కాపాడటంలోనూ భారతదేశం మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సూచీ తెలియజేస్తుంది. 

జీవవైవిధ్యం, గాలి కాలుష్యం, గాలి, నీటి నాణ్యత, వ్యర్థాల నిర్వహణ, ఉద్గారాల వృద్ధి రేట్లు మొదలైన వాటితో సహా 58 ప్రమాణాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 2024 పర్యావరణ పనితీరు సూచీలో ఎస్తోనియా మొదటి స్థానంలో ఉండగా, ఫిన్లాండ్​, గ్రీస్​, తైమూర్​ లెస్టే, యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2050 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి అవసరమైన రేటుతో జీహెచ్​జీ ఉద్గారాలను తగ్గించాలి.