వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ-హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ రైలును అందుబాటులో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
బెంగళూరు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ఈ ఎక్స్ ప్రెస్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తుంది. లిసెట్ ను సెప్టెంబర్ 20న రైల్వే శాఖకు అప్పగించనుంది. డిసెంబర్ చివరి నాటికి దేశంలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది.
ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లలో రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఉంటాయని తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్లీపర్ కోచ్‌లు విశాలమైన బెర్త్‌లు, ప్రకాశవంతమైన ఇంటీరియర్‌లు, విశాలమైన టాయిలెట్లు ఉండబోతున్నాయని రైల్వే శాఖ చెబుతోంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు..వేగం..సదుపాయాలు
16 కోచ్ ల వందేభారత్ స్లీపర్ రైలు గరిష్టంగా 160 కిలోమీటర్లు వేగంతో నడుస్తాయి. కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్ లు , 823 బెర్తులుంటాయి. పదకొండు 3AC కోచ్ లు(611 బెర్త్ లు), నాలుగు 2AC కోచ్ లు(188బెర్తులు) , ఒకటి 1AC కోచ్ (24బెర్త్ లు) ఉంటాయి.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ రైలు కోచ్ లో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్ లెట్ లు, స్నాక్ టేబుల్, మొబైల్/మ్యాగజౌన్ హోల్డర్లు ఉంటాయి. అన్ని కోచ్‌లలో స్టెయిన్‌లెస్ స్టీల్ కార్ బాడీలు ఉంటాయి. ప్రయాణికుల భద్రత ఉంటుంది. GFRP ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి. కంపార్ట్‌మెంట్లు అన్నీ ఫైర్ రెసిస్టెంట్, ఆటో మేటిక్ డోర్లు ఉంటాయి.