ఇప్పటివరకు మనం బొగ్గుతో నడిచే రైలు..కరెంట్ తో నడిచే రైలు.. హైస్పీడ్ రైలు, బుల్లెట్ రైళ్లు ఇలా అనేక రకాల రైళ్లను చూశాం..ఇప్పడు మరో కొత్త రకం రైలు రాబోతోంది.. అదీ భారత్ లో మొట్టమొదటి రైలు.. దీనికి ఇంజిన్ కు సంబంధించిన అన్ని టెస్టులు విజయవంతంగా నిర్వహించింది రైల్వే మంత్రిత్వ శాఖ.. ఇంతకీ అది ఏం రైలు.. ఎలా నడుస్తుంది.. ఇంజిన్ లో ఇంధనంగా ఏం వాడుతారు.. వేగం ఎంత.. సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని R &D అయిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) భారత దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోసం ఇంధన సెల్, బ్యాటరీ వ్యవస్థల పనితీరును సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది.. ఈ విషయాన్ని బుధవారం (ఆగస్టు 29) న ప్రకటించింది.
జింద్- సోనిపట్ ల మధ్య డ్రైవ్ సైకిల్ సిమ్యులేషన్ సరిపోల్చడానికి పరీక్ష నిర్వహించారు. సక్సెస్ ఫుల్ అయ్యారు. పర్యావరణం, రైల్వే రవాణాలో అభివృద్దిలో భారత్ ముందుంచే క్రమంలో హైడ్రోజన్ రైలు ఇంజిన్ టెస్టింగ్ ఓ మైలు రాయి.
త్వరలో 35 హైడ్రోజన్ రైళ్లు
హెరిటేజ్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమం కింద 35 హైడ్రోజన్ రైళ్లను తీసుకొస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతేడాది రాజ్యసభలో ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు అందించారు. ఒక్కో రైలు సుమారు రూ. 80కోట్లు, గ్రౌండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు హెరిటేజ్ , హిల్ రూట్ లకోసం రూ. 70 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
అయితే ఇప్పటికే హైడ్రోజన్ ఇంధన కణాలతో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రేక్ లను రీట్రోఫిట్ చేయడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది రైల్వే శాఖ. గ్రౌండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో సహా ఈ ప్రాజెక్ట రూ. 111.82కోట్లతో మంజూరు చేశారు. నార్గ్ రైల్వే జోన్ లో జింద్ పానిపట్ సెక్షన్ కోసం ఈ ప్రణాళికలు చేశారు.
పర్యావరణ పరిరక్షణ, జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాలకు మద్దుతుగా హైడ్రోజన్ రైళ్లను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.