సిరియాలో అంతర్యుద్ధం.. సిరియా రాజధాని డమాస్కస్ ను ఇస్లామిక్ తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకోవడం.. సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్లడం వంటి కీలక పరిణామాలు ఆదివారం (డిసెంబర్ 8)న చోటుచేసుకున్నాయి. సిరియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో అక్కడ ఉన్న భారతీయు పరిస్థితిపై భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.సిరియాలో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించింది.
సిరియా రాజధాని డమాస్కస్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అధికారుల అక్కడున్న మొత్తం 90 మంది ఇండియన్ సిటిజన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇందులో 14 మంది యూఎన్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
డమాస్కస్ లో ఉన్న భారతీయులతో ఎంబసీ టచ్ లో ఉంది.. వారంతా సురక్షితంగా ఉన్నారు. అని ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్దంతో అల్లకల్లోలంగా ఉన్న దేశంలో భారతీయ పౌరులకు సహాయం అందించేందుకు ఎంబసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఆదివారం (డిసెంబర్ 8) తెల్లవారు జామున డమాస్క్ ను తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకోవడంతో ఐదు దశాబ్దాల పాలనకు ముగింపు పలికింది. సిరియా అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. ఈ క్రమంలో సిరియాలోని భారతీయ పౌరుల భద్రత , సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని భారత ఎంబసీ తెలిపింది.