రైల్వే ప్రయాణికుల కోసం నవరాత్రి స్పెషల్ థాలీ

  • 150 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చిన రైల్వేశాఖ

సికింద్రాబాద్, వెలుగు: నవరాత్రుల సమయంలో రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ నవరాత్రి స్పెషల్​థాలీ పేరుతో ప్రత్యేక భోజన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. రైల్వే ముంబై సెంట్రల్, ఢిల్లీ జంక్షన్, సూరత్, జైపూర్, లక్నో, పాట్నా జంక్షన్, లూథియానా, దుర్గ్, చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్, అమరావతి, హైదరాబాద్, తిరుపతి, జలంధర్, థానే, పూణే, మంగళూరు సెంట్రల్ స్టేషన్లలో స్పెషల్ థాలీని ప్రవేశపెట్టింది.

ప్రయాణికులు   ఈజీగా ఆర్డర్​ చేసుకోవచ్చు. రైల్వే ఐఆర్​సీటీసీ రూపొందించిన మొబైల్​యాప్, రైల్వే అధికారిక వెబ్​సైట్లలో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ఆర్డర్​ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.