జీ20 సమిట్​లో ప్రధాని మోదీ

రియో డి జనీరో: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బ్రెజిల్​లో మొదలైన  జీ20 సదస్సుకు హాజరయ్యారు. నైజీరియా నుంచి నేరుగా బ్రెజిల్ లోని రియో డి జనీరోకు చేరుకున్న మోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. జీ20 సదస్సుకు హాజరైన బైడెన్​, జిన్ పింగ్​, మాక్రాన్​, మెలొని, కీవ్​ స్టార్మర్​లను ఆప్యాయంగా పలకరించారు. 

అంతకుముందు బ్రెజిల్​లో అడుగుపెట్టానంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల అధినేతలతో జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని, సదస్సు ఫలవంతం కావాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. కాగా ట్రోయ్ గా సభ్యుడిగా 19వ జీ20లో మోదీ పాల్గొంటున్నారు. 

బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు ఇండియా కూడా ట్రోయ్ కాలో సభ్యదేశంగా ఉంది. జీ20 సదస్సులో ఫ్రాన్స్  ప్రెసిడెంట్  ఎమ్మానుయేల్  మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూకే ప్రధాని కీర్  స్టార్మర్​తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు మోదీ.. గయానాలో పర్యటించనున్నారు.

 కాగా, బ్రెజిల్​లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ఇండియన్  కమ్యూనిటీ వారు వేద మంత్రాలతో సాదర స్వాగతం పలికారు. ‘‘బ్రెజిల్​లో భారత సంస్కృతి వేడుకలు. మరిచిపోలేని స్వాగతం ఇది. మీరు ఇచ్చిన ప్రేమపూర్వక సాదర స్వాగతానికి నా మనసు పులకరించింది. కృతజ్ఞతలు” అని మోదీ ట్వీట్  చేశారు.