ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది.
ఖాళీలు: మొత్తం 40 (మహిళలకు 8 ఖాళీలు కేటాయించారు) ఖాళీలు ఉన్నాయి. వయసు 2 జులై 2005 నుంచి 1 జనవరి 2008 మధ్య జన్మించిన వారై ఉండాలి.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్) 2024 పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
సెలెక్షన్: జేఈఈ (మెయిన్) 2024 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.