IT కంపెనీల గుడ్ న్యూస్:తీసేయటం కాదు..20శాతం ఎక్కువ మందిని తీసుకుంటాం..!

ఇండియన్ ఐటీ సెక్టార్​ అభివృద్దిపథంలో దూసుకుపోతోంది. అడ్వాన్స్ డ్​ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో భారతీయ IT ఇండస్ట్రీ మరింత వృద్ధి సాధించనుంది. దీం తో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2025లో కొత్త ఉద్యోగాలు 20శాతం  పెరిగే అవకాశం ఉందని హ్యూమన్​ రీసోర్స్ ప్లాట్​ఫాం ఫస్ట్‌ మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ చెబుతోంది. 

2024లో భారతీయ ఐటీ పరిశ్రమలో కొత్తగా 17 శాతం ఉద్యోగాలు కల్పించబడ్డాయి. వేగవంతమైన డిజిటల్​ట్రాన్స్​ ఫార్మింగ్, అడ్వాన్స్​డ్​ టెక్నాలజీతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. ​ అయితే 2024 మొదటి అర్థభాగంలో ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ తర్వాతి భాగంలో కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.ఇది 2025లో కూడా కొనసాగించేందుకు ఐటీ  కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. 

అప్లికేషన్​ డెవలపర్స్​, సాఫ్ట్​ వేర్​ ఇంజనీర్లు,DevOps ఇంజనీర్లు, AI , ML వంటి పోజిషన్లలో దాదాపు 20 శాతం ఉద్యోగాలు కల్పించబడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా 2024లో ట్రెండింగ్​ లో ఉన్న  ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (AI) 2025మరింత వేగవంతం కానుంది. డేటా ఎనలిస్టులు, డేటా ఇంజనీర్లు, డేటా సైంటి స్టులు వంటి పోస్టులకు మంచి డిమాండ్​ ఉండనుంది. 

2028నాటికి GenAI సెక్టార్​లో 10లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.  ఇది స్థూల జాతియోత్పత్తిపై కీలక ప్రభావం చూపుతుందని అంటున్నారు.2025లో  జనరేటివ్​ AI ఇంజనీర్లు, అల్గారిథమ్, AI సెక్యూరిటీ స్పెషలిస్ట్​ లకు 25నుంచి 30 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉంది. 

వ్యాపార విస్తరణ, కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నపుడు నియామకాలు పెరుగుతాయి.డిజిటల్​ సదుపాయాలు మెరుగుపడతాయి. టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ మద్దతునిస్తుంది. 2018నుంచి 2024 మధ్యకాలంలో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్స్​ వంటి ఇండస్ట్రీస్​ రావడంతో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 

మరోవైపు 2030 నాటికి ఐటీ సెక్టార్​లో 2.5 నుంచి 25లక్షల నుంచి 28 లక్షల ఉద్యోగాల కల్పన జరగొచ్చని అంచనా.వీటితోపాటు BFSI, టెలికం వంటి నాన్​ టెక్​సెక్టార్లు కూడా ఐటీ, టెక్​నిపుణులను పెంచుకునే అవకాశం ఉంది.