ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం అలర్ట్ : డేంజర్ జోన్లో రెండు కోట్లమంది ఫోన్లు

ఇండియాలో మొబైల్ ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14 మరియు లెటెస్ట్ 15 వెర్షన్‌ల ఫోన్లలో సెక్కురిటి లోపం ఉండవచ్చని తెలిపింది. అటాకర్స్ సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ చోరీ చేసేందుకు, ఫోన్‌లో ఆర్బిటరీ కోడ్ పంపేందుకు ఈ ఆండ్రాయిడ్ వర్షన్లు అనుమతిస్తున్నయని CERT-In  హెచ్చరిస్తోంది. ఆయా వర్షన్ల ఫోన్లు వాడే వారు హై రిస్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండియాలో దాదాపు ఆండ్రాయిడ్  12, 12L, 13, 14 మరియు లెటెస్ట్15 వెర్షన్‌ల ఫోన్ యూజర్ల సంఖ్య 20 మిలియన్లు ఉంది. అంటే రెండు కోట్లమంది యూజర్లు. అక్టోబర్ 11న అన్ని వర్షన్ల ఫోన్లకు హై రిస్క్ అలర్ట్ పంపారు. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్‌లు, మీడియాటెక్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లు మరియు క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌లలో లోపాల కారణంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు CERT-in బులెటిన్ విడుదల చేసింది.

ALSO READ | 5జీనే కాదు 6జీతో మరిన్ని రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు : జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ

ఆండ్రాయిడ్ ఫోన్ బ్రాండ్‌లు ఎక్కువగా మీడియాటెక్ , క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లను ఉపయోగిస్తాయి. ఇవి హార్డ్‌వేర్‌పై నడుస్తున్న పరికరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. వీవో, షావోమి, సామ్సంగ్ మరియు వన్ ప్లస్ వంటి బ్రాండ్ ఫోన్లు ప్రధాన భద్రతా లోపం వల్ల ప్రభావితమవుతాయని తెలుస్తోంది. డేటా చోరీ చేయడానికి అటాకర్స్ ఆర్బిటరీ కోడ్ పంపిస్తారు. 

ఆండ్రాయిడ్ సెక్యూరిటీ రిస్క్: ఇలా సేఫ్ గా ఉండండి 

  • ఆయా కంపెనీల ఫోన్లు ఎప్పటికప్పుడు సెక్కురిటీ అప్డేట్స్ పంపిస్తాయి. వాటిని ఇన్‍స్టాల్ చేసుకోవాలి. 
  • ఫోన్ సెట్టింగ్‌లలో లెటస్ట్ వర్షన్ కు మారాలి. 
  • ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14 మరియు లెటెస్ట్15 వెర్షన్‌ల ఫోన్లలో అన్ నోన్ లింక్స్ పై క్లిక్ చేయకండి. 
  • థార్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. 
  • తెలియని మెయిల్‌ల నుండి లింక్‌లపై క్లిక్ చేయోద్దు.