ఇండియన్ బ్యాంకులో లోకల్ ఆఫీసర్స్​

ఇండియన్ బ్యాంక్ 2024–-25 సంవత్సరానికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

ఖాళీలు: మొత్తం 300 పోస్టుల్లో ఎస్సీ- 44; ఎస్టీ- 21; ఓబీసీ- 79; ఈడబ్ల్యూఎస్‌‌- 29; జనరల్ - 127 కేటగిరీల వారీగా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రానికి 50 పోస్టులు ఉన్నాయి.


అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)విద్యార్హత ఉండాలి. వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్ రాత/ ఆన్‌‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.


ఎగ్జామ్​ ప్యాటర్న్​: రీజనింగ్ అండ్‌‌ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్‌‌ ఇంటర్‌‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు). 


అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.indianbank.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.