ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్తున్న ఇండియన్ ఆస్ట్రోనాట్స్ వీరే

నాసా ఇద్దరు ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపనుంది. శుక్రవారం అమెరికా స్పేస్ సెంటర్ అయిన నాసా వారి పేర్లును ప్రకటించింది. మెయిన్ ఆస్ట్రోనాట్ గా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను, బ్యాకప్( సెంకడ్ ప్రియారిటీ) కోసం గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను ఎంపిక చేసింది.

స్పేస్ కు వెళ్లే సమయంలో శుభాంశు శుక్లాకు ఏవైనా సమస్యలు వస్తే.. బ్యాకప్ లో ఉన్న ప్రశాంత్ బాలకృష్ణన్ ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్ కు వెళ్తారు. గగన్‌యాన్ మిషన్ కోసం భారతదేశం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములలో వారిద్దరూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 అమెరికాలో తన అధికారిక పర్యటన సందర్భంగా.. అమెరికా మిషన్‌లో భాగంగా ఒక భారతీయ వ్యోమగామి ISSకి వెళతారని ప్రకటించిన విషయం తెలిసింది.