ఈ ఆర్టిస్ట్ క్రియేటివిటీ వేరే లెవెల్.. గిన్నెలు, గ్లాసులతో కళాకృతులు!

సుబోధ్​ గుప్తా బీహర్​కి చెందిన ఆర్టిస్ట్​. ఆయన తయారుచేసే కళాకృతులకు హద్దులే ఉండవు. అందుకు నిదర్శనం ఈ ఫొటోలే. ఈ కళాకృతిని తయారుచేయడానికి స్టెయిన్​లెస్ స్టీల్ మెటీరియల్ వాడాడు. ఇంట్లో వాడే గిన్నెలు, గ్లాసులు, వంటపాత్రలు, చెంచాలు, గరిటెలు... ఇలా దేన్నీ వదల్లేదు. 

ప్రస్తుతం బీహార్​ మ్యూజియంలో ది వే హోమ్​’ పేరుతో సొంతంగా ఒక ప్రోగ్రామ్​ చేస్తున్నాడు. అందులో స్టీల్​తో తయారుచేసిన ఈ కళాకృతులు చూపరులను కట్టిపడేస్తున్నాయి.