ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. తన టీంలో ఇండో అమెరికన్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లకు తన టీంలో కీలక పదవులు ఇచ్చిన ట్రంప్.. తాజాగా అత్యంత కీలకమైన ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా మరో ఇండో అమెరికన్ ను నామినేట్ చేశారు. గుజరాత్ మూలాలున్న ఇండోఅమెరికన్ కాష్ పటేల్ ఎఫ్బీఐ డైరెక్టర్ గా నామినేట్ చేశారు ట్రంప్.
కాష్ డోనాల్డ్ ట్రంప్ కి అత్యంత విధేయుడని తెలుస్తోంది. కాష్ తెలివైన లాయర్ అని.. పరిశోధకుడని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికన్లను రక్షించేందుకు కాష్ తన కెరీర్ అంకితం చేశారని అన్నారు ట్రంప్.. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయం పంచుకున్నారు ట్రంప్.
తన మొదటి పదవీకాలంలో కాష్ పటేల్ అందించిన సేవలను గుర్తు చేసుకున్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా కుట్రలను బయటపెట్టడంతో కాష్ కీరోల్ ప్లే చేశారని అన్నారు ట్రంప్. ప్రస్తుత ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ వ్రే పట్ల అసంతృప్తి కారణంగానే ట్రంప్ కాష్ పటేల్‌ను నియమించారని తెలుస్తోంది.
Also Read : 4,002 కానిస్టేబుల్ పోస్టులకు 5.59 లక్షల మంది అప్లై
ఎవరీ కాష్ పటేల్:
కాష్ పటేల్.. ఈస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చి న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్థిరపడిన గుజరాతీ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. లా చదివిన కాష్ ఫ్లోరిడాలో పబ్లిక్ డిఫెండర్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో న్యాయవాదిగా పని చేరారు.ఈస్ట్ఆఫ్రికా, అమెరికాలో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కేసులను వాదించిన ట్రాక్ రికార్డ్ కాష్ సొంతం. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో సివిల్ లాయర్‌గా చేరిన కాష్.. ట్రంప్ మొదటి పదవీకాలంలో కీలకంగా వ్యవహరించారు.