పెర్త్ టెస్టులో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ఆతిధ్య ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడుతూ ఓడిపోయే మ్యాచ్ లో గెలిచారు. 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 295 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయినా.. ఆ తర్వాత భారత్ పుంజుకున్న తీరుకు ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 న అడిలైడ్ వేదికగా జరుగుతుంది.
Also Read:-సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
8 వికెట్ల నష్టానికి 227 పరుగులతో టీ విరామం తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 11 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత సుందర్ రెండో బంతికే లియాన్ ను బౌల్డ్ చేశాడు. క్యారీ (36) చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. సుందర్ రెండు వికెట్లు తీయగా నితీష్ రెడ్డి, హర్షిత్ రానాకు తలో వికెట్ లభించింది.
అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత పేసర్ల ధాటికి 104 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా గా వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. జైస్వాల్ (161) కోహ్లీ (100) సెంచరీలతో చెలరేగారు. 534పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 242 పరుగులకే ఆలౌటైంది.
From 150 all out to winning by 295 runs ?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 25, 2024
Skipper Jasprit Bumrah leads India to a famous Test win in Perth ? https://t.co/FIh0brqKuj #AUSvIND pic.twitter.com/UJmxSe0L7N