IND vs BAN: చుక్క వాన లేకున్నా.. ఒక్క బాల్‌‌‌‌ పడలే

  • చిత్తడి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో రోజు ఆట రద్దు
  • డ్రా దిశగా ఇండియా, బంగ్లా రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీసీసీఐపై విమర్శలు

కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య  రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో రోజు ఆట కూడా వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. శనివారం రాత్రంతా కురిసిన వర్షం వల్ల ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్తడిగా మారడంతో.. ఆదివారం మూడో రోజు ఆటను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ఒక్క బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పడకుండానే రెండు రోజుల ఆట వర్షార్పణం అయ్యింది. ఉదయం నుంచి వాన లేకపోయినా.. ఔట్‌‌ఫీల్డ్ అక్కడక్కడ చిత్తడిగా ఉందనే ఏకైక కారణంతో ఆటను రద్దు చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. రెండో రోజు కూడా ఉదయం 10 గంటలకు వర్షం ఆగిపోతే మధ్యాహ్నం 2 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇక మూడో రోజు ఉదయం నుంచి వాన జాడ లేదు. కానీ ముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్కడక్కడ బురద ప్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని అంపైర్లు ప్రకటించారు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఉదయం నుంచి శ్రమించినా వాటిని సరి చేయలేకపోవడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. చివరకు మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూసిన అంపైర్లు ఆటను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, చివరి రెండు రోజుల్లో ఫలితాన్ని రాబట్టడం కష్టం. కాబట్టి ఈ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా కావడం ఖాయంగా కనిపిస్తోంది.  టాస్ ఓడిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 107/3 స్కోరు చేసింది. మోమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (40 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్క వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశాడు. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం ఇండియా 1-–0 లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. 

పేలవమైన డ్రైనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. ఈ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరుగైన డ్రైనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌ లేదని ఆరోపణలు వచ్చినా బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. టెస్టులను దేశ వ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను ఎంపిక చేశామని బోర్డు ఒకే ఒక్క సమాధానంతో సరిపెట్టింది. కానీ రెండు రోజుల ఆటలో వర్షం లేకపోయినా తేమ ప్రదేశాలను ఆరబెట్టే వ్యవస్థలేకపోవడం బోర్డుకు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది.

చిత్తడి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆటను కొనసాగిస్తే ప్లేయర్లు గాయపడే ప్రమాదం ఉండటంతో అంపైర్లు రద్దు నిర్ణయం తీసుకున్నారని కొంత మంది చెబుతున్నారు. అయితే ఇటీవల న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏకైక టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేదికైన గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోయిడా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.  ఐదు రోజుల ఆటలో ఒక్క బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సాధ్యపడలేదు. దీంతో వరుసగా ఈ రెండు సంఘటనలతో బీసీసీఐపై సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. 2019లో  సౌతాఫ్రికాతో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చ జరగడంతో మంచి స్టేడియాలను మాత్రమే టెస్టులకు కేటాయించాలని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. వన్డే, టీ20లను ఇతర స్టేడియాలకు ఇవ్వాలని సూచించాడు. అయినా బీసీసీఐలో ఎలాంటి మార్పు రాలేదు. 

డబ్ల్యూటీసీ పాయింట్లపై ప్రభావం!

రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా అయితే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇండియా  కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇది మొత్తం పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దెబ్బ పడుతుంది. ప్రస్తుతం ఇండియా (71.67), ఆస్ట్రేలియా (62.50) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2లో ఉండగా, శ్రీలంక (55.56) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకొచ్చింది.  వచ్చే నెలలో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇండియాతో 3 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడనుంది. ఇందులో పరిస్థితులు ప్రతికూల ఫలితాలు వస్తే ఇండియాకు ఎదురుదెబ్బే కానుంది.