ముంబై టెస్టులో భారత్ గాడిలో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన టీమిండియా.. రెండో రోజు తొలి సెషన్ లో కోలుకుంది. రిషబ్ పంత్, గిల్ భాగస్వామ్యంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (70), జడేజా (10) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు వెనకబడి ఉంది.
4 వికెట్ల నష్టానికి 86 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. తొలి రెండు బంతుల్లోనే బౌండరీలు బాది పంత్ ధాటిగా ఆరంభించాడు. మరో ఎండ్ లో గిల్ కూడా బ్యాట్ ఝళిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఈ క్రమంలో గిల్, పంత్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్, పంత్ క్యాచ్ లు మిస్ అవ్వడం భారత్ కు కలిసి వచ్చింది. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో ఇష్ సోధీ భారత్ కు షాక్ ఇచ్చాడు. 60 పరుగులు చేసి జోరు మీదున్న పంత్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు.
Also Read :- నువ్వు బాగా ఆడినా నో ఛాన్స్
ఐదో వికెట్ వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజ్ లోకి వచ్చిన జడేజాతో గిల్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ను ముగించారు. ఈ సెషన్ లో భారత్ 109 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. హెన్రీ, సోధీ లకు తలో వికెట్ లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌటైంది.
Not a single maiden bowled in the session as Gill and Pant get India back in the game ?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2024
? https://t.co/Vq9uHVazcz | #INDvNZ pic.twitter.com/Jiq2fCDPz1