K-4 Ballistic Missile: దమ్ముంటే ఇప్పుడు రండ్రా : భారత్ అణుబాంబు రాకెట్ పరీక్ష విజయవంతం

అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టక్ మిసైల్ ను ఇండియన్ నేవీ ఆర్మీ సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. కొత్తగా నేవీ ఆర్మీలో చేరిన న్యూక్లియర్ సబ్ మెరిన్  INS అరిఘాట్ నుంచి గురువారం ( నవంబర్ 28)  జరిపిన అణ్వాయుధ సామర్థ్యంగల  K4 బాలిస్టిక్ క్షిపణ ప్రయోగం విజయవంతం అయింది.  3500 కిలోమీటర్ల రేంజ్ ను ఈజీగా టర్గెట్ చేసిందని ఆర్మీ అధికారులు తెలిపారు. 

K4  బాలిస్టిక్ క్షిపణీ ప్రయోగాన్ని బంగాళాఖాతంలో నిర్వహించారు. ఈ ప్రయోగం దేశ రక్ష్ణ సామర్థ్యాలలో ఓ మైలు రాయి. ఇందులో భారత్ అణునిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా ఉంది. క్షిపణి టెస్టింగ్ కు ముందు నీటి అడుగున ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా క్షిపణి ప్రయోగ ట్రయల్స్‌ను DRDO నిర్వహించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఈ బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల కొత్తగా నేవీ ఆర్మీలో చేరిన INS అరిఘాట్ నుంచి ప్రయోగించారు. ఆగస్టులో INS అరిఘాట్ ను విశాఖపట్నంలోని షిప్ బిల్డంగ్ సెంటర్ లో ప్రారంభించి నావికా దళానికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. 

భారత్ నేవీ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది.. ఇందులో భాగంగా భారత నౌకాదళం క్షిపణి వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది. K4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలాంటివి మరిన్ని నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం రక్షణ దళంలో బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల సామర్థ్యాన్ని ఉన్న రెండు అణు సబ్ మెరిన్లు  ఉన్నాయి. 

ఇదివరకే సేవలు అందిస్తున్న INS అరిహంత్ తోపాటు ఆగస్టులో  INS అరిఘాట్ చేరడంతో అణు సబ్ మెరిన్ వ్యవస్థ మరింత బలోపేతం అయింది. వీటితో పాటు మూడో అణు జలాంతర్గామిని 2025 లో ప్రారంభించేందుకు భారత్ ప్రభుత్వం సిద్దమవుతోంది.