పొట్టు బియ్యం, బ్రౌన్ రైస్​పై 10 శాతం దిగుమతి సుంకం

  • కస్టమ్స్ డ్యూటీని  సవరించిన కేంద్రం
  • కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ 

హైదరాబాద్, వెలుగు: బియ్యం దిగుమతుల కోసం  కస్టమ్స్ డ్యూటీని సవరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్  జారీ చేసింది. సవరించిన కస్టమ్స్​ డ్యూటీ వెంటనే అమలులోకి రానుంది. సవరించిన దిగుమతి సుంకాల ప్రకారం పొట్టు బియ్యం పై 10 శాతం, బ్రౌన్​ రైస్​పై 10 శాతం, పారా బాయిల్డ్​ రైస్​పై 10 శాతం దిగుమతి సుంకం వసూలు చేయనున్నారు.

 పారా బాయిల్డ్​ బాస్మతీ బియ్యంపై సున్నా శాతం దిగుమతి సుంకాన్ని కేంద్రం ప్రకటించింది. కస్టమ్స్  చట్టం 1962లోని సెక్షన్ 25(1) ప్రకారం ఈ మార్పులను ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది.  ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నోటిఫికేషన్  తక్షణం అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బియ్యం దిగుమతిదారులు, దేశీయ మార్కెట్  రెండింటిపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.