టాప్ 10 GenAI స్టార్టప్ హబ్లలో ఇండియా..ప్రపంచంలో 6వ స్థానం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)..అన్నిరంగాల్లో AI వేగంగా విస్తరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలలిజెన్స్ని వినియోగించని కంపెనీ లేదని అంటే ఆశ్చర్యమేమిలేదు. దీంతో Gen AI సేవలను అందిం చే స్టార్టప్ల సంఖ్య కూడా ఇండియాలో గణనీయంగా పెరుగుతోంది. 

మన దేశంలో గడిచిన సంవత్సరంలో జనరేటివ్ AI( GenAI)  స్టార్టప్ ల సంఖ్య 4.6 రెట్లు పెరిగింది. 2023 మొదటి భాగంలో 66 స్టార్టప్ లు ఉంటే 2024 జూన్ వరకు 240 కి పైగా ఏర్పాటు చేయబడ్డా య ని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ Gen AI స్టార్టప్ ఎకో సిస్టమ్ వాటాలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది.  

2023 నుంచి ఇప్పటివరకు 22 శాతం గణనీయమైన పెరుగుదలతో 750 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు Gen AI స్టార్టప్ కోసం సేకరించబడ్డాయి. 2024 జనవరి నుంచి జూన్ కాలంలో 75 శాతం స్టార్టప్ లు ఆదాయాన్ని పొందుతున్నాయి. 

Also Read :- విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ యాప్ ముఠా

గడిచిన ఏడాదిలో భారత్ Gen AI ల్యాండ్ స్కేప్ ఒకరకంగా టెక్నాలజీ రంగాన్ని షేక్ చేస్తుంది అని చెప్పొచ్చు.  కంపెనీల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM),డేటా ఆధారిత సర్వీసెస్  లను హైలైట్ చేసింది. 

ప్రస్తుతం మన దేశంలో బెంగళూరు GenAI స్టార్టప్ హబ్ గా మొదటిస్థానంలో ఉంది. మొత్తం స్టార్టప్ లలో 43 శాతం ఇక్కడే ఉన్నాయి. అహ్మదాబాద్, లక్నో, సూరత్, కోల్ కతా లలో ఎమర్జింగ్ హబ్ లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థలో 18 శాతం రిప్రజెంటెటివ్ గా ఉంటున్నాయని నాస్కామ్ రిపోర్టులు చెబుతున్నాయి. 

Gen AI ని పూర్తి స్థాయిలో అన్ లాక్ చేయడం ద్వారా ఈ టెక్నాలజీ రెవెల్యూషన్ లో భారత్ ను గ్లోబల్ లీడర్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని నాస్కామ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా అన్నారు.