IND vs NZ 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే పైచేయి

పూణే టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ తొలి రోజే 259 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజ్ లో శుభమాన్ గిల్ (10), జైశ్వాల్ (6) ఉన్నారు. రోహిత్ శర్మ డకౌటయ్యాడు. ఏకైక వికెట్ సౌథీ తీసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగులు వెనకబడి ఉంది.  

న్యూజిలాండ్ ను 259 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. కొత్త బంతిని సద్వినియోగం చేసుకొని మూడో ఓవర్ లోనే సౌథీ రోహిత్ ను క్లీన్ బౌల్డ్ చేస్తాడు. ఈ సిరీస్ లో సౌథీ బౌలింగ్ లో రోహిత్ రెండో సారి బౌల్డవ్వడం విశేషం. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్(10), ఓపెనర్ జైస్వాల్ (6) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 

ALSO READ | Rani Rampal: రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ లెజెండ్

అంతకముందు 5 వికెట్ల నష్టానికి 201 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 58 పరుగులు మాత్రమే జోడించగలిగింది. సుందర్ ధాటికి ఒక్కరు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. ఫిలిప్స్(9), సౌథీ(5), అజాజ్ పటేల్(4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 33 పరుగులు చేసి సాంట్నర్ కొద్దిగా పోరాడాడు. అంతకముందు తొలి సెషన్ లో కాన్వే(76), రెండు సెషన్ లో రచీన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలు చేసి న్యూజిలాండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు.