AI వాడకంలో మనమే ఫస్ట్..గ్లోబల్ డౌన్ లోడ్స్లో 21శాతం ఇండియాదే

వాడకం అంటే ఇది. వాడకంలో ఇండియన్స్ మించిన వారులేరు. ప్రపంచవ్యాప్తంగా AI అప్లికేషన్లు వాడుతున్న వారిలో మనమే టాప్..2024 సంవత్సరంలో ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంటే గడిచిన 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా AI మొబైల్ అప్లికేషన్లు వాడిన మొత్తంలో 21శాతం ఇండియన్స్ ఉన్నారు. ఎంతలా అంటే ఈ మొబైల్ అప్లికేషన్ వాడకం 2.2 బిలియన్ అంటే 220 కోట్లకు చేరింది.

చాట్ GPT, మైక్రోసాఫ్ట్ Copilot, Google Geminiలతో పాటు వివిధ ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ ల వంటి మోస్ట్ పాపులర్ AI అప్లికేషన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఇంతా పాపులారిటీ, డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది యూజర్లు యాప్ లు, అప్లికేషన్లను ఉచితంగా పొందుతున్నారు. 

యాప్ ల కొనుగోలు ఆదాయం.. 

AI అప్లికేషన్ వినియోగంలో ఇండియాలో పోలిస్తే నార్త్ అమెరికా, యూరప్ లలో పరిస్థితి భిన్నంగా  ఉంది. ఆ దేశాల్లో దాదాపు 68 శాతం AI అమ్మకాలపూ యాప్ రెవెన్యూ పొందుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా యాప్ పర్చాస్ రెవెన్యూ 200కోట్ల మార్క్ దాటింది. గత సంవత్సరంతో పోలిస్తే 51 శాతం పెరిగింది. ఇందులో ఇండియా కంట్రిబ్యూషన్ 2 శాతం మాత్రమే. 2024 చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా AI అప్లికేషన్ల రెవెన్యూ 3.3 బిలియన్ డాలర్లకు చేరుతుందని సెన్సార్ టవర్స్ అంచనా వేస్తోంది.   

ALSO READ : Career Tips : ఇలా ప్లాన్ గియ్యాలె.. అలా పట్టు పట్టాలె..!

అయినప్పటికీ ఈ పెరిగిన AI వాడకానికి మద్దతుగా, డివైజ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ స్పీడ్ ప్రాసెసర్లను ఎక్కువ మెమరీ స్టోరేజ్‌పై దృష్టి పెట్టి కొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మినీ మోడల్‌లు పరికరాలలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి దాదాపు 4-5 GB నిల్వ అవసరం.