ఆస్ట్రేలియా- ఎ vs ఇండియా -ఎ.. కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఫుల్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయి న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చివరి రెండు టెస్టులకు దూరమైన టీమిండియా సీనియర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి మేటి పేసర్లతో సవాల్‌కు ముందు ఆస్ట్రేలియా–ఎ బౌలర్లను ఎదుర్కోనున్నాడు. ముందుగానే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకున్న  రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం నుంచి ఆస్ట్రేలియా–ఎ జట్టుతో జరిగే రెండో అనధికార టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ పోరులో కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అతని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. స్కాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తను ఏ విధంగా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది. 

ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభించనుండగా.. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదు లేదా ఆరో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే అవకాశం ఉంది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–ఎతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిన ఇండియా ఈ పోరులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇదే ఎంసీజీలో కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 26 నుంచి బాక్సింగ్ డే టెస్టులో పోటీ పడనుంది. కాగా, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తప్పించిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి అతడిని ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపించింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇద్దరూ ఈ నెల 11న సీనియర్ జట్టుతో కలుస్తారు.