ఐటీడీఏ ఎదుట కాంట్రాక్టు టీచర్ల నిరవధిక సమ్మె

భద్రాచలం, వెలుగు : ఐటీడీఏ ఎదుట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ట్రైబల్​ వెల్ఫేర్​ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్టు టీచర్లు నిరవధిక సమ్మె సోమవారం నాల్గవ రోజుకు చేరుకుంది. 280 మంది కాంట్రాక్టు టీచర్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సమ్మెకు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​, బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు లక్కినేని సురేందర్​, టీటీటీఎఫ్​ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్​ నాయక్, రాష్ట్ర​ అధ్యక్షులు వీరూనాయక్​, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు.