సఫారీ పర్యటనలో ఉన్న టీమిండియా అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నేడు(నవంబర్ 08) డర్బన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ ఐడెన్ మర్క్ రమ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుతం డర్బన్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. బలమైన గాలులు వీస్తున్నాయి. ఏ క్షణమైనా వరుణుడు ఎంట్రీ ఇవ్వొచ్చు. అదే జరిగితే, బౌలింగ్ జట్టుకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు విషయానికొస్తే, తొలి టీ20 కావడంతో మేనేజ్మెంట్ ఎలాంటి ప్రయోగాలు చేయదలచుకోలేదు. దాంతో, యువ పేసర్లు విజయ్ కుమార్ వైశాఖ్, యష్ దయాళ్ బెంచ్‌కే పరిమితమయ్యారు.
తుది జట్లు
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూసింగ్, అక్షర్‌పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మర్క్ రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, న్కాబయోమ్జి పీటర్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ.
A rematch of T20 World Cup final, with some fresh faces
— ESPNcricinfo (@ESPNcricinfo) November 8, 2024
Andile Simelane makes his international debut ?
? https://t.co/YoQnNFOZUV | #SAvIND pic.twitter.com/lo2TGxN1Gz