ఓటు హక్కుపై ప్రజలను చైతన్య పరుస్తాం

నల్గొండ అర్బన్, వెలుగు : ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ కేశవులు ముదిరాజ్ తెలిపారు. కేశవులు ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నల్గొండలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మానసిక వికలాంగుల పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కుపై ప్రజలకు ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుష్యర్ల సత్యనారాయణ, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, సీడీపీవో నిర్మల, వన్ టౌన్ ఎస్ఐ శంకర్, సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి పాల్గొన్నారు.