కాపీ కొడుతుండని స్టూడెంట్ ను చితకబాదిన టీచర్

  • జగిత్యాల టౌన్ లోని ప్రైవేట్ స్కూల్ లో ఘటన

జగిత్యాల టౌన్, వెలుగు:  ఎగ్జామ్స్ కాపీ కొడుతుండని టెన్త్ స్టూడెంట్ ను టీచర్ చితకబాదిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. టీచర్ కర్ర విరిగేలా కొట్టడంతో స్టూడెంట్ కాలి కమిలింది. జగిత్యాల టౌన్ లో సోమవారం  సువిద్య స్కూల్ లో టెన్త్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా.. టెన్త్ స్టూడెంట్ ఫౌజాన్ కాపీకి పాల్పడ్డాడని, అతడిని టీచర్ శోభ కర్రతో చితకబాదారు.

దీంతో పేరెంట్స్ వెళ్లి స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే కర్ర విరిగేలా కొడతారా అంటూ మండిపడ్డారు. స్కూల్ హెడ్మాస్టర్ ను సంప్రదించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.